తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఒలింపిక్స్​కు భారత హాకీ జట్టు అర్హత సాధిస్తుంది' - indian hockey'

వచ్చే ఒలింపిక్స్​కు భారత హాకీ జట్టు అర్హత సాధిస్తుందని దిగ్గజ మాజీ ఆటగాడు ధన్​రాజ్ పిళ్లై తెలిపారు. ప్రస్తుతం జట్టు బలంగా ఉందన్నారు.

ధన్​రాజ్

By

Published : Aug 31, 2019, 6:30 AM IST

Updated : Sep 28, 2019, 10:49 PM IST

2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్​కు భారత హాకీ జట్టు క్వాలిఫై అవుతుందని దిగ్గజ మాజీ ఆటగాడు ధన్​రాజ్పిళ్లై ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రజట్లతో పోటీపడే సామర్థ్యం టీమిండియాకు ఉందని తెలిపారు.

"ప్రస్తుతం ఆస్ట్రేలియా, జర్మనీ, హాలెండ్, అర్జెంటీనా, బెల్జియం లాంటి అగ్రశ్రేణి జట్లకు తీసిపోని విధంగా భారత్ ఉంది. ఆటగాళ్లు ఏ జట్టుకు భయపడకుండా..ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ముందుగా ఒలింపిక్స్​కు అర్హత సాధించడం ముఖ్యం. భారత్​కు విశ్వటోర్నీలో పతకం రావాలన్నది నా ఒక్కడి కల కాదు.. ప్రతి ఒక్కరి కల. 1980 తర్వాత హాకీలో పతకం సాధించలేదు.

-ధన్​రాజ్పిళ్లై, భారత మాజీ హాకీ ఆటగాడు

చివరి సారిగా భారత్​ 1980లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించింది. 2008లో అసలు క్వాలిఫై కాలేదు. ఈసారి టీమిండియా జట్టు బలంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్​ కోసం క్వాలిఫయర్ మ్యాచ్​ల షెడ్యూల్ సెప్టెంబర్ 9న వెలువడనుంది.

ఇవీ చూడండి.. సెలక్టర్లకు ధోనీ సమయం.. పంత్​కు మద్దతు

Last Updated : Sep 28, 2019, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details