పార్లమెంటులో పౌరసత్వ బిల్లు ఆమోదంపై జరుగుతున్న ఆందోళనలపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. నిరసనల్లో గాయపడిన జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులను పట్టించుకోవాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.
"రాజకీయారోపణలు ఎప్పుడూ ఉండేవే. నిరసనల్లో గాయపడిన జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులను పట్టించుకోవాలి. దేశమంతా ఈ అంశంపై దృష్టిసారించాలి" -ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా క్రికెటర్.