పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ మ్యాచ్ విన్నర్‌గా మారాలంటే టీమ్ఇండియా సారథి కోహ్లీని చూసి నేర్చుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. విరాట్ సెట్ చేసిన రికార్డును దృష్టిలో పెట్టుకుని, బాబర్ తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకోవచ్చని సూచించాడు.
"పాక్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ ఇప్పుడు చేయాల్సిందల్లా మ్యాచ్ విజేతగా మారడమే. ఆ లక్షణాన్ని కోహ్లీ నుంచి నేర్చుకోవాలి. అప్పుడే బలమైన ఆటగాడిగా ఎదుగుతాడు. ప్రస్తుతం అతడి వయసు 25 ఏళ్లు. బాగా ఆడి తన బలం నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం. 1992లో ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు ఇంజిమామ్ భారీగా స్కోరు చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు అతడి గణాంకాలు అద్భుతం. అలానే బాబర్ కూడా ఇటీవలే జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడకపోయినప్పటికీ.. తర్వాతి సిరీస్‌లలో రాణిస్తాడని భావిస్తున్నాను. ఇది సాధ్యం కావాలంటే బాబర్ మరింత శ్రమించాల్సి ఉంటుంది"