తెలంగాణ

telangana

ETV Bharat / sports

రూ.కోటి ఇచ్చిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ - కరోనా కట్టడి కోసం గౌతమ్ గంభీర్ విరాళం

కరోనా కట్టడి విషయంలో ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయల్ని ఇచ్చాడు. ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నాడు.

రూ.కోటి ఇచ్చిన మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్
గౌతమ్ గంభీర్

By

Published : Mar 29, 2020, 12:17 PM IST

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, కరోనా బాధితుల విషయంలో దాతృత్వం చాటుకున్నాడు. ప్రస్తుతం లోక్​సభ సభ్యుడిగా ఉన్న ఇతడు.. సహాయక చర్యల కోసం తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు విడుదల చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించాడు. తన నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లు చెప్పాడు. గంభీర్ ఫౌండేషన్​ ద్వారా దిల్లీలోని తన నియోజకవర్గ ప్రజల కోసం ఆహార పొట్లాలను పంచుతున్నట్లు ఓ వీడియోను ట్వీట్ చేశాడు.

మరోవైపు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు.. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలను సహాయక చర్యల కోసం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పుడే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పారు.

కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు

ప్రస్తుతం భారత్​లో 819 మంది కరోనా బారిన పడగా, 19 మంది ప్రాణాలు విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 30 వేల మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details