తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆటగాళ్లకు గాయాలు- ఫీల్డింగ్​ చేసిన కోచ్..!

ప్రస్తుతం ఇంగ్లీష్​ జట్టుకు ఫీల్డింగ్​ కోచ్​గా ఉన్న పాల్ కాలింగ్​వుడ్.. శనివారం జరిగిన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్..​ ప్రపంచకప్​ వార్మప్ మ్యాచ్​లో ఆటగాడిగా కనిపించాడు. జట్టులోని కొందరు ప్రధాన ఆటగాళ్లకు గాయలు కావడమే ఇందుకు కారణం.

ఆటగాడిగా మారిన ఇంగ్లండ్​ ఫీల్డింగ్​ కోచ్

By

Published : May 25, 2019, 8:53 PM IST

Updated : May 25, 2019, 9:01 PM IST

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ప్రస్తుతం జట్టుకుఫీల్డింగ్​ కోచ్​గా ఉన్న పాల్ కాలింగ్​వుడ్ మైదానంలో ఆటగాడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్​లో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్​లు గాయాల బారిన పడటం వల్ల అతడు ఆడాల్సి వచ్చింది.

పాల్ కాలింగ్​వుడ్

ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్​లో ప్రపంచకప్​ జెర్సీ ధరించి కనిపించాడు కాలింగ్​వుడ్. ఈ మ్యాచ్​కు జో రూట్ విశ్రాంతి తీసుకున్నాడు. గాయం కారణంగా కెప్టెన్ మోర్గాన్ ఆడలేదు. భుజం నొప్పితో స్పిన్నర్ రషీద్ అందుబాటులో లేడు. ఇంతమంది గైర్హాజరుతో తప్పని పరిస్థితుల్లో కాలింగ్​వుడ్ ఫీల్డింగ్​ చేయాల్సి వచ్చింది. ప్రపంచకప్​ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్​ జట్టులోని ఆటగాళ్లు గాాయాల బారిన పడటం ఆ జట్టు మేనేజ్​మెంట్​ను కలవరపరిచే అంశమే.

ఇంగ్లాండ్​ తరఫున 197 అంతర్జాతీయ వన్డే మ్యాచ్​లు ఆడాడు కాలింగ్​వుడ్. 5 వేల పరుగులతో పాటు 111 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 11 టెస్టులు, 36 టీ20ల్లోనూ పాల్గొన్నాడు. 2010లో టీ20 వరల్డ్​కప్​ గెలిచిన ఇంగ్లాండ్​ జట్టుకు సారథిగా ఉన్నాడు.

ఇది చదవండి: పాక్​ ఆటగాళ్ల ఆనందానికి భారత్ అడ్డు..!

Last Updated : May 25, 2019, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details