టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించి రోహిత్ శర్మను నియమిస్తారని గత కొన్నిరోజులుగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై వస్తున్న వార్తలపై మాట్లాడటానికి నిరాకరించారు బీసీసీఐ పాలకమండలి చీఫ్ వినోద్ రాయ్. ఈ కథనాలు సృష్టించింది మీడియానే అని అసహనం వ్యక్తంచేశారు.
"కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలు సృష్టించింది మీరే(మీడియా). వీటి గురించి మాట్లాడదల్చుకోలేదు" -బీసీసీఐ సీఓఏ వినోద్‌రాయ్