కోహ్లీసేనను స్లెడ్జ్ చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ భయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్. తమ ఐపీఎల్ కాంట్రాక్ట్లు కాపాడుకునేందుకు వారు ఇలా చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాల్ని చెప్పాడు.
"క్రికెట్లో ఆర్థికంగా భారత్ ఎంత శక్తిమంతమైనదో అందరికీ తెలుసు. అందుకే ఆస్ట్రేలియాతో పాటు మిగిలిన జట్లు కొంతకాలం నుంచి టీమిండియాను చూసి భయపడుతున్నాయి. కోహ్లీతో పాటు మిగతా క్రికెటర్లను స్లెడ్జ్ చేసేందుకు వెనకాడుతున్నాయి. ఏప్రిల్లో భారత్ ఆటగాళ్లతో కలిసి ఆడాలని వారికి తెలుసు. కోహ్లీ సారథ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు వారిని తీసుకుంటే, ఆరు వారాల్లో మిలియన్ డాలర్లు సంపాదించొచ్చని చాలా మంది అనుకుంటున్నారు. అందుకే మైదానంలో కోహ్లీసేనతో దురుసుగా ప్రవర్తించడం లేదు" -మైకేల్ క్లార్క్, ఆసీస్ మాజీ క్రికెటర్