తెలంగాణ

telangana

ETV Bharat / sports

గేల్ ఫన్నీ అప్పీల్.. అంపైర్ ముసి ముసి నవ్వుల్..! - Mzansi Super League gayle funny appeal

మాన్షి సూపర్ లీగ్‌లో క్రిస్ గేల్ సరదా అప్పీల్ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది. ఔటివ్వమని అంపైర్​ను గేల్ ప్రాధేయపడిన విధానానికి అందరూ నవ్వుకున్నారు.

Chris Gayle's Funny Appeal In Mzansi Super League Leaves Umpire Smiling.
గేల్ ఫన్నీ అప్పీల్.. అంపైర్ ముసి ముసి నవ్వుల్..!

By

Published : Nov 26, 2019, 9:41 PM IST

మైదానంలో విచిత్రంగా ప్రవర్తించడం.. విభిన్నంగా నర్తిస్తూ అభిమానులను అలరించడంలో వెస్టిండీస్ క్రికెటర్లు ముందుంటారు. తాజాగా విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ వినూత్నంగా అప్పీల్ చేసి నవ్వులు పూయించాడు. ఈ సరదా అప్పీల్​కూ అంపైర్​ కూడా నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మాన్షి సూపర్ లీగ్‌లో అతడు జోజీ స్టార్స్‌ తరఫున ఆడుతున్నాడు గేల్. అతడు వేసిన బంతి.. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ హెన్రీ డేవిడ్ ప్యాడ్​కు తగలింది. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేస్తూ అంపైర్​ను గేల్​ ప్రాధేయపడిన విధానానికి అందరూ నవ్వుకున్నారు. గేల్ సరదా అప్పీల్​కు అంపైర్​ కూడా ముసి ముసి నవ్వులు నవ్వాడు.

జట్టు యాజమాన్యం నుంచి సరైన గౌరవం అందట్లేదని క్రిస్‌ గేల్‌ లీగ్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. జట్టు అతడిని భారంగా చూస్తుందని గేల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన జోజీ స్టార్స్ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. ఆరు మ్యాచ్​ల్లో గేల్ 101 పరుగులు మాత్రమే చేశాడు. 54 అత్యుత్తమ స్కోరు.

ఇదీ చదవండి: 26/11 అమరులకు క్రీడాసమాజం అశ్రు నివాళులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details