విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ రిటైర్మెంట్పై స్పష్టతనిచ్చాడు. స్వదేశంలో టీమిండియాతో జరిగే వన్డే, టెస్టు సిరీస్ తనకు చివరిదని వెల్లడించాడు. ఆగస్టు-సెప్టెంబరులో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని కొన్ని రోజుల ముందు వెల్లడించాడీ క్రికెటర్. కానీ గురువారం భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
"ఇది ముగింపు కాదు. ఇంకొన్ని మ్యాచ్‌లు ఆడతాను. అది ఇంకో సిరీస్ కావొచ్చు. ఏం జరుగుతుందో చుద్దాం. భారత్‌తో జరిగే వన్డే, టెస్టు సిరీస్‌ల్లో ఆడొచ్చు. ప్రపంచకప్ తర్వాత నా ప్లాన్ ఇదే." -క్రిస్ గేల్, వెస్టిండీస్ క్రికెటర్