మైదానం దాటి బయటికి వెళ్లగానే పార్టీలు.. పాటలు.. డ్యాన్సులంటూ ఎప్పుడూ సరదాగా గడిపే వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ మరోసారి తన నాట్య ప్రతిభను బయటపెట్టాడు. ఐపీఎల్-14 కోసం భారత్ చేరుకున్న ఈ పంజాబ్ కింగ్స్ ఆటగాడు.. క్వారంటైన్ ముగిసిందన్న ఆనందంతో దివంగత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ 'స్మూత్ క్రిమినల్' పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశాడు.
ఆనందంలో గేల్ 'మూన్ వాక్' స్టెప్పులు - క్రిస్ గేల్ మైఖెల్ జాక్సన్ మూన్ వాక్
ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చిన వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ తాజాగా క్వారంటైన్‌ను ముగించుకున్నాడు. ఈ ఆనందంలో పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ పాటకు కాలు కదుపుతూ కనిపించాడు.
ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన పంజాబ్ కింగ్స్.. "క్వారంటైన్ ముగిసింది. మీకు ఇష్టమైన ఆటగాడు గేల్ బయటకు వచ్చాడు" అనే వ్యాఖ్య జతచేసింది. అందులో 41 ఏళ్ల గేల్ ఉత్సాహంగా కాళ్లు కదుపుతూ కనిపించాడు. మైఖేల్ జాక్సన్ సుప్రసిద్ధ స్టెప్పు అయిన మూన్‌వాక్‌ను కూడా గేల్ చక్కగా చేశాడు.
గత సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన గేల్ 137.14 స్ట్రైక్‌రేట్‌తో 288 పరుగులు చేశాడు. ఈసారి జట్టుకు టైటిల్ అందించే దిశగా తనదైన బ్యాటింగ్‌తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. పంజాబ్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌లో సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.