యూనివర్స్ బాస్ క్రిస్ గేల్.. మైదానంలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన ప్రతిలీగ్నూ దాదాపు పాల్గొన్న ఈ క్రికెటర్.. వచ్చే నెల నుంచి మొదలయ్యే ఐపీఎల్ కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో ఓ సరికొత్త వస్తువుతో కనిపించనున్నాడు. అదే ఓ బంగారు ఉంగరం.
క్రిస్ గేల్ బంగారు ఉంగరంపైనా అదే సంఖ్య - IPL 2020
తన కొత్త బంగారు ఉంగరాన్ని డిఫరెంట్గా డిజైన్ చేయించాడు విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.
విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్
దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఉంగరంపై క్రిస్ గేల్ బొమ్మతో పాటు, చుట్టూ యూనివర్స్ బాస్ అని రాసి ఉంటుంది. ఉంగరం అడుగు భాగంలో గేల్ ఆటోగ్రాఫ్.. పక్కన 333 అనే సంఖ్య ఉంది. టెస్టుల్లో ఇతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 333 పరుగులు. అందుకే జెర్సీపైనా ఈ నెంబరునే వేయించుకున్నాడు.
ఐపీఎల్లో ప్రస్తుతం పంజాబ్ తరఫున ఆడుతున్న గేల్.. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ 125 మ్యాచ్‌లు ఆడాడు. 4,484 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 పరుగులు.
Last Updated : Mar 2, 2020, 6:21 AM IST