ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు జట్టు ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బంది దుబాయ్ వెళ్లనున్నారు. ఐపీఎల్ ఆఖర్లో వీరంతా దుబాయ్ చేరుకుని అక్కడే ఆరు రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. ఐపీఎల్ అనంతరం టీమ్ఇండియా బృందం ఆస్ట్రేలియాకు బయల్దేరుతుంది. యూఏఈలోని ఒక బయో బబుల్ నుంచి ఆస్ట్రేలియాలోని మరో బడుగలోకి టీమ్ఇండియా బృందాన్ని సురక్షితంగా తరలించాలన్నది బీసీసీఐ ఆలోచన. ఆస్ట్రేలియా నిబంధనలు సడలించకపోతే మాత్రం టీమ్ఇండియాకు 14రోజుల క్వారంటైన్ తప్పనిసరి.
ఆ సిరీస్ కోసం దుబాయ్‌కి పుజారా, విహారి - australia series pujara vihari
ఆస్ట్రేలియా పర్యటన కోసం టెస్టు ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, కోచ్ రవిశాస్త్రి ఐపీఎల్ ఆఖర్లో దుబాయ్ వెళ్లనున్నారు. అక్కడ మెగాలీగ్ పూర్తవ్వగానే టీమ్ఇండియా బృందంతో కలిసి ఆస్ట్రేలియాకు బయల్దేరుతారు.
పుజారా, విహారి
"టీమ్ఇండియా మొత్తాన్ని దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆస్ట్ట్రేలియా తరలించడమే అన్నిటికంటే అనువైన ప్రణాళిక. అందుకోసం ఈ నెలాఖర్లో పుజారా, విహారి, రవిశాస్త్రి, భరత్ అరుణ్, విక్రమ్ రాఠోడ్, ఆర్. శ్రీధర్‌లు దుబాయ్ చేరుకుంటారు. వీరికి క్వారంటైన్ ముగిశాక జట్టంతా కలిసి ఆస్ట్రేలియాకు బయల్దేరుతుంది" అని బీసీసీఐ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి కోహ్లీ.. బంతికి ఉమ్ము రాయబోయి