తెలంగాణ

telangana

By

Published : Jan 21, 2021, 1:30 PM IST

ETV Bharat / sports

'ఆ ముద్దులే నా గాయాలకు మందులు'

క్రికెట్​ కోసం ఎంతటి కష్టానైన్నా భరిస్తానని చెప్పిన టీమ్​ఇండియా క్రికెటర్​ పుజారా.. దెబ్బ తాకినప్పుడు మందులు వేసుకోవడాని కన్నా నొప్పిని భరించడానికే తాను సిద్ధపడతాడన్నాడు. అందుకే ఆసీస్​తో జరిగిన ఆఖరి టెస్టులో చాలా గాయాలు తగిలినప్పటికీ ఎక్కువ సేపు ఆడగలిగాడని అన్నాడు. ఆ గాయాలు మానడానికి తాను ఎలాంటి చికిత్స తీసుకుంటాడో కూడా వివరించాడు.

pujara
పుజారా

దెబ్బ తగిలినప్పుడు పెయిన్​ కిల్లర్స్ తీసుకోవడానికన్నా.. ఆ నొప్పిని భరించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని అంటున్నాడు టీమ్​ఇండియా క్రికెటర్​ పుజారా. అందుకే గబ్బా టెస్టులో చాలా దెబ్బలు తగిలినప్పటికీ వెనుదిరగకుండా ప్రత్యర్థులను ఎదుర్కోగలిగానని చెప్పాడు. ఆట కోసం ఎంతటి కష్టానైన్నా భరించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని వెల్లడించాడు.

"నాకు చిన్నప్పటి నుంచి దెబ్బ తగిలినప్పుడు పెయిన్​ కిల్లర్స్​ తీసుకునే అలవాటు లేదు. అందుకే ఎంతటి నొప్పినైనా భరించగలను. ఎక్కువ సేపు ఆడాల్సి వచ్చినప్పుడు గాయాలు తగిలే అవకాశముంటుంది. అందుకు సిద్ధపడే బ్యాటింగ్​ చేస్తా."

-పుజారా, టీమ్​ఇండియా క్రికెటర్​.

ఆసీస్​ పర్యటన ముగించుకున్న టీమ్​ఇండియా గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. అయితే ఒంటి నిండా గాయాలతో ఇంటికొచ్చిన పుజారాకు.. తన కూతురు ఇంటి చికిత్స చేసి నయం చేసిందని అన్నాడు. "ఇంటికి రాగానే నా కూతురు దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది. తనకు గాయమైనప్పుడల్లా.. ప్రేమతో దగ్గర తీసుకుని ముద్దులు పెట్టేవాడిని. ఆ అలవాటే తనకు వచ్చింది. ముద్దు పెడితే గాయం మానుతుందని తాను నమ్ముతుంది." అని పుజారా వివరించాడు.

ఆసీస్​తో గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో దాదాపు ఐదు గంటల పాటు క్రీజులో ఉన్నాడు పుజారా. 211 బంతులు ఆడి 52 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి: ఇలానే ఆడతా.. అంతకుమించి కష్టం: పుజారా

ABOUT THE AUTHOR

...view details