లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి క్రికెటర్లు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చట్లు, ఆన్లైన్ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా, భారత బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా ఓ మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రపంచ ఉత్తమ టెస్టు ఎలెవన్ జట్టులో ఎవరెవరిని ఎంచుకుంటారని అడగ్గా విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లతో సహా పలువురి పేర్లను వెల్లడించాడు.
డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్లను ఓపెనర్లుగా పేర్కొన్నాడు. ఇక కోహ్లీ, స్మిత్‌లకు తర్వాతి స్థానాలు కల్పించాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ వాట్లింగ్ కూడా తన జట్టులో ఉండాలని పుజారా కోరుకున్నాడు.