ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్ఇండియా క్రికెటర్ పుజారా బ్యాటింగ్‌పై విమర్శలు పలువరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడీ జాబితాలోకి ఆసీస్ మాజీ సారథి అలెన్ బోర్డర్ కూడా చేరిపోయాడు. పుజారా షాట్లు ఆడటానికి భయపడ్డాడని అన్నాడు.
"పుజారా 28.41స్టైక్‌రేట్‌తో నెమ్మదిగా ఆడాడు. అతడి బ్యాటింగ్‌లో తీవ్రత లేదు. దృష్టంతా క్రీజులో ఎక్కువ సేపు ఉండటానికే ప్రయత్నించాడు. షాట్లు ఆడటానికి చాలా భయపడ్డాడు. నిజమే కదా? అతడి ఆటతీరు టీమ్ఇండియాపై తీవ్ర ప్రభావం చూపింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను వారు తట్టుకోలేకపోయారు. ఏదేమైనప్పటికీ ఆసీస్ బౌలింగ్ అదరగొట్టింది. ఒక్క బంతిని కూడా వృథా చేయలేదు"