కరోనా లాక్డౌన్ వల్ల వచ్చిన విరామం తర్వాత మైదానంలోకి మళ్లీ అడుగుపెట్టాడు టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా. సోమవారం తన స్వస్థలంలోని ఓ మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు పుజారా.
ప్రాక్టీస్ షురూ చేసిన టీమ్ఇండియా నయావాల్
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు టీమ్ఇండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా. సోమవారం తన స్వస్థలంలోని మైదానంలో ప్రాక్టీసు చేస్తున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.
ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమ్ఇండియా నయావాల్
"చాలా కాలం తర్వాత బ్యాట్ పట్టా. కానీ, ఒకసారి ఆడిన తర్వాత నిన్ననే ఆడినట్లు అనిపించింది" అని ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు టీమ్ఇండియా నయావాల్.
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. లాక్డౌన్ సడలింపుల కారణంగా తాజా పరిస్థితుల్లో క్రీడా కార్యక్రమాలు తిరిగి ఊపందుకున్నాయి. ఈ క్రమంలో విరామం తర్వాత క్రీడాకారులు తమ ఫిట్నెస్ను తిరిగి పొందటానికి శిక్షణ మొదలుపెట్టారు.