టీమ్ఇండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కిడ్నీ సమస్యతో పోరాడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. చేతన్ చౌహాన్ జూలైలో కరోనా బారిన పడ్డారు.
కరోనా చికిత్స పొందుతున్న ఆయనకు కిడ్నీ, బీపీ సమస్యలు తలెత్తడం వల్ల వెంటిలేటర్‌పై ఆత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.