దాదాపు ఎనిమిదేళ్లుగా మూసివేసిన చెపాక్ స్టేడియంలోని ఐ,జే,కే (మూడు) స్టాండ్లకు ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు వల్లమోక్షం లభించింది. వాటిని తిరిగి తెరవనున్నట్లు తెలిపారు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రామసామి. ప్రస్తుతం వాటిని శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు 12వేల సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్టాండ్స్‌కు సంబంధించిన టికెట్లను ఫిబ్రవరి 8(సోమవారం) నుంచి కేవలం ఆన్లైన్లో అమ్మబోతున్నట్లు తెలిపారు.
ఒక్కో టికెట్ ధర రూ. 100,150, 200గా నిర్ణయించినట్లు వెల్లడించారు రామసామి. ఒకవేళ కొనుక్కున్న టికెట్లను రద్దు చేసుకోవాలంటే అందుకు సంబంధించిన ప్రక్రియ స్డేడియం వద్ద ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ సమయంలో అక్కడికి వచ్చి ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం సహ సామాజిక దూరం పాటించాలన్నారు. రెండో టెస్టు ఫిబ్రవరి 13-17 వరకు జరగనుంది.