తెలంగాణ

telangana

ETV Bharat / sports

జట్టులో మార్పులపై 'సీఎస్కే' ఆసక్తికర సమాధానం - ChennaiIPL

వచ్చే ఏడాది ఏప్రిల్​లో ప్రారంభమయ్యే ఐపీఎల్​లో​ చెన్నై సూపర్​ కింగ్స్​లో మార్పులున్నాయా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది ఆ జట్టు యాజమాన్యం.

ఐపీఎల్​ 2020: చెన్నై సూపర్​ కింగ్స్​లో మార్పులున్నాయి: యాజమాన్యం

By

Published : Nov 8, 2019, 8:31 PM IST

Updated : Nov 8, 2019, 8:51 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)​లో అత్యంత ప్రజాదరణ పొందిన, విజయవంతమైన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. మహేంద్ర సింగ్​ ధోనీ నేతృత్వంలో మూడు సార్లు విజేతగా నిలిచింది.

సామాజిక మాధ్యమాల్లోనూ అభిమానులు ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీ, జట్టు విషయాలను తెలుసుకొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇటీవలే ఓ అభిమాని ట్విటర్లో అడిగిన ప్రశ్నకు సీఎస్‌కే సమయస్ఫూర్తితో ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది.

"సీఎస్‌కే జట్టులో ఏమైనా మార్పులున్నాయా?" అని ఓ అభిమాని ట్విటర్లో ప్రశ్నించాడు. అందుకు స్పందించిన చెన్నై యాజమాన్యం.. "అవును, డాడీస్‌ ఆర్మీ వయసు మరో ఏడాది పెరిగింది" అని చమత్కరించింది.

రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో జరిగిన వేలంలో తన పాత ఆటగాళ్లనే ఎక్కువగా తీసుకుంది చెన్నై. అందువల్ల జట్టు సగటు వయసు 30 దాటింది.

ఆ సమయంలో చెన్నైను "డాడీస్‌ ఆర్మీ" అని కొందరు ఎగతాళి చేశారు. వేగంగా పరిణామాలు మారే టీ20ల్లో వారేం చురుగ్గా ఆడతారని వెటకారం చేశారు. కానీ వీటన్నింటినీ ఎదుర్కొని ధోనీసేన 2018లో కప్పు కొట్టింది. అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఈ ఏడాది రన్నరప్​గా నిలిచింది.

Last Updated : Nov 8, 2019, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details