తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఉత్తమ ఫ్రాంచైజీ అంటే చెన్నై సూపర్​ కింగ్స్'

తాను ఆడిన ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ ​కింగ్స్​(సీఎస్​కే) ఉత్తమ జట్టని శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ తెలిపారు.​ ఇటీవలే ఓ షోలో మాట్లాడిన మురళీధరన్​.. జట్టులో చేరినప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ పలు విషయాలు పంచుకున్నారు.

Chennai Super Kings was the best franchise I have played for: Muttiah Muralitharan
'ఉత్తమమైన ఫ్రాంచైజీ అంటే 'చెన్నై సూపర్​ కింగ్స్'​'

By

Published : Jun 15, 2020, 2:54 PM IST

ఇప్పటివరకు తాను ఆడిన ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్​కింగ్స్(సీఎస్​కే) ఉత్తమ జట్టని శ్రీలంక మాజీ బౌలర్​ ముత్తయ్య మురళీధరన్​ తెలిపారు. ఇటీవలే మైండ్​ మాస్టర్స్​ షోలో పాల్గొన్న ఆయన.. సీఎస్​కే​లో చేరినప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. చెన్నైకి చెందిన స్థానిక ఆటగాళ్లతో ఉన్నప్పుడు తామంతా సొంత భాషలో మాట్లాడుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. ధోనీ పట్ల ఉన్న గౌరవం వల్లే.. సీఎస్​కే జట్టులో భాగం కావాలని కోరుకున్నట్లు మురళీధరన్​ వెల్లడించారు.

"నేను ఐపీఎల్​లో పాల్గొంటే చెన్నైకి ఆడాలని దేవుడ్ని ప్రార్థించా. ప్రతి జట్టులో స్థానిక ఆటగాళ్లు ఉండాలని నియమం ఉండేది. సుమారు 7, 8 మంది మాతృభాష మాట్లాడేవాళ్లమే ఉన్నాం. ఫలితంగా 3ఏళ్లు సొంత భాషలో మాట్లాడుకునే వీలు కలిగింది. నేను 6 నుంచి 7 సంవత్సరాలు లంకషైర్​ తరఫున కూడా ఆడా. కానీ ఇప్పటివరకు నేను ఆడిన ఫ్రాంచైజీల్లో ఉత్తమమైనది 'సీఎస్​కే'."

-ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక మాజీ బౌలర్​

ఐపీఎల్​ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్​ కింగ్స్​(సీఎస్​కే) అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటిగా గుర్తింపు పొందుతూ వచ్చింది. ఎంఎస్​ ధోనీ నేతృత్వంలోని జట్టు ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. క్రికెట్​ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్​ ఉన్న సీఎస్​కేలో.. ఎంతో మంది సీనియర్​ ఆటగాళ్లు సంవత్సరాలుగా భాగమవుతూ వచ్చారు. వారిలో శ్రీలంక బౌలర్​ ముత్తయ్య మురళీధరన్​ ఒకరు. ఐపీఎల్​ తొలి ఎడిషన్​లో సీఎస్​కేలో చేరారు. 2008 నుంచి 2010 వరకు జట్టు తరఫున మూడు సీజన్లు ఆడారు.

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details