తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేవలం భారత ఆటగాళ్లతో ఐపీఎల్​కు సీఎస్​కే నో!

కరోనా కారణంగా ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. కానీ ఈ లీగ్​ను కేవలం భారత ఆటగాళ్లతోనే నిర్వహించే వీలుందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది. అలా నిర్వహించడానికి తాము వ్యతిరేకమని సీఎస్​కే అధికారి ఒకరు తెలిపారు.

By

Published : May 12, 2020, 4:32 PM IST

సీఎస్​కే
సీఎస్​కే

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్​ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైరస్ ప్రభావం తగ్గకపోవడం వల్ల ఇప్పటికే ఈ టోర్నీని నిరవధిక వాయిదా వేశారు. ఈ మెగా లీగ్ నిర్వహించే వీలుపై ఇప్పటికే ఐపీఎల్ పాలకమండలి కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. అందులో ఒకటి కేవలం భారత ఆటగాళ్లతో లీగ్ నిర్వహించడం. అయితే ఈ అంశాన్ని చెన్నై సూపర్ కింగ్స్ వ్యతిరేకిస్తోంది.

"కేవలం భారత ఆటగాళ్లతో ఐపీఎల్ నిర్వహించాలన్న ప్రతిపాదనకు మేము వ్యతిరేకం. అలా చేస్తే అది మరో ముస్తాక్ అలీ (దేశవాళీ టీ20 టోర్నీ) టోర్నీ అవుతుంది. ఈ ఏడాది చివర్లో లీగ్ జరుగుతుందని ఆశిస్తున్నాం. ఐపీఎల్ వాయిదా పడిన దగ్గర నుంచి బీసీసీఐతో సంప్రదింపులు జరపలేదు. టోర్నీ జరిపే విషయమై త్వరలోనే బీసీసీఐ ఓ మంచి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం."

-సీఎస్​కే అధికారి

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశీయ, అంతర్జాతీయ రవాణాపై చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. పరిస్థితులు సర్దుమణిగినా విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్​లో పాల్గొనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

ABOUT THE AUTHOR

...view details