చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటి. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలోనూ దాని స్థానం ముందు వరుసలోనే ఉంటుంది. లీగ్‌లో అత్యధికంగా ఎనిమిది ఫైనల్స్ ఆడిన జట్టుగా ఘనత సాధించడమే కాదు.. గత సీజన్ ముందు వరకు టోర్నీలో బరిలోకి దిగిన ప్రతిసారీ సెమీస్/ప్లేఆఫ్ ఆడిన రికార్డూ ఆ జట్టు సొంతం. కానీ నిరుడు యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో కథ మారిపోయింది. ఎన్నడూ లేని విధంగా పేలవ ప్రదర్శన చేసింది. తొలిసారి ప్లేఆఫ్‌కు దూరమైంది. దీంతో సీఎస్‌కే సామర్థ్యంపై ఎన్నో సందేహాలు! ఆ జట్టు భవితవ్యంపైనా ఎన్నో ప్రశ్నలు! వాటికి ధోనీ బృందం.. ఐపీఎల్-14లో ఎలాంటి సమాధానం చెబుతుందన్నది ఆసక్తికరం.
ఉత్తమ ప్రదర్శన 2010, 2011, 2018లో ఛాంపియన్
ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ది ఘన ప్రస్థానం. 2008లో తొలి సీజన్లోనే రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. ఇంకో రెండేళ్ల తర్వాత ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాతి ఏడాది కూడా టైటిల్ అందుకుంది. ఐపీఎల్‌లో మరే జట్టుకూ సాధ్యం కాని నిలకడను, ఉన్నత స్థాయి ఆటను ప్రదర్శించిన జట్టు సీఎస్‌కే. అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ముంబయి రికార్డు నెలకొల్పి ఉండొచ్చు కానీ.. ఆ జట్టుకు కూడా సాధ్యం కాని విధంగా గత సీజన్ ముందు వరకు ప్రతిసారీ సెమీస్/ప్లేఆఫ్ చేరిన ఘనత చెన్నై సొంతం. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కారణంగా నిషేధం పడటం వల్ల 2016, 17 సీజన్లకు దూరమైన ఆ జట్టు.. పునరాగమనంలో తొలి ఏడాదే ఛాంపియన్ అయింది. తర్వాతి ఏడాది రన్నరప్‌గా నిలిచింది. కాగితం మీద చెన్నై జట్టును చూసి విశ్లేషకులు ఈసారి కష్టమే అనడం.. తీరా టోర్నీ మొదలయ్యాక అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు ముందంజ వేయడం.. చాలాసార్లు జరిగింది. అయితే గత సీజన్లో మాత్రం సీఎస్‌కే అనూహ్యంగా తడబడింది. ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చన్న అంచనాల నేపథ్యంలో అతనెలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.
దేశీయ ఆటగాళ్లు: ధోనీ (కెప్టెన్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, నారాయణ్ జగదీశన్, పుజారా, రవీంద్ర జడేజా, ఉతప్ప, కృష్ణప్ప గౌతమ్, కర్ణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ, హరి నిశాంత్, కేఎం అసిఫ్, సాయికిశోర్.
విదేశీయులు: డుప్లెసిస్, డ్వేన్ బ్రావో, సామ్ కరన్, ఎంగిడి, హేజిల్‌వుడ్, తాహిర్, మొయిన్ అలీ, శాంట్నర్.