తెలంగాణ

telangana

ETV Bharat / sports

'చెన్నై ధోనీని తీసుకోవడం నాకు బాధ కలిగించింది' - కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్‌ దినేశ్​ కార్తీక్ మనస్సును కలిచివేసింది.

ఐపీఎల్​ ప్రారంభ సీజన్​లో చెన్నై జట్టు.. తనను కాకుండా ధోనీనీ తీసుకోవడం బాధేసిందని వెల్లడించాడు సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్. సొంత రాష్ట్ర జట్టు తరఫున ఆడాలనే కోరిక అలాగే మిగిలిపోయిందని అన్నాడు.

Chennai Super Kings picking MS Dhoni over me was the biggest dagger to my heart: Dinesh Karthik
'ధోనీని తీసుకోవడం నన్ను కలిచివేసింది'

By

Published : Apr 23, 2020, 2:33 PM IST

Updated : Apr 23, 2020, 2:44 PM IST

ఐపీఎల్​ ప్రారంభ సీజన్​ వేలంలో చెన్నై సూపర్​కింగ్స్​.. స్వరాష్ట్రానికి చెందిన తనను పక్కన పెట్టి ధోనీని తీసుకోవడం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పాడు కోల్​కతా నైట్​రైడర్స్ ప్రస్తుత​ సారథి దినేశ్​ కార్తీక్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

"2008 ఐపీఎల్‌ వేలం జరుగుతున్నప్పుడు తమిళనాడుకు చెందిన క్రికెటర్లలో నేను గొప్ప ఆటగాడిని. అప్పుడు నా పేరు ప్రధానంగా వినిపించింది. దాంతో చెన్నై సూపర్​ కింగ్స్​.. నన్ను ఎంపిక చేసుకుంటుందనే అనుకున్నా. కానీ అనూహ్యంగా 1.5 మిలియన్లకు వారు ధోనీని కొనుగోలు చేశారు. అతడు నా పక్కనే ఉన్నా.. ఆ విషయం నాకు చెప్పలేదు. కనీసం తర్వాత సీజన్​లోనైనా నన్ను జట్టులోకి తీసుకుంటారని ఎదురుచూశా. అలా 13 ఏళ్లు గడిచిపోయాయి. అయినా నన్ను తీసుకుంటారనే ఆశతో ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నా" -దినేశ్​ కార్తీక్​, కేకేఆర్​ సారథి

ఐపీఎల్​లో ఇప్పటివరకూ ముంబయి ఇండియన్స్​, దిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్ల తరఫున ఆడాడు కార్తీక్​. ప్రస్తుతం కేకేఆర్​కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ లీగ్ 13వ సీజన్​ నిరవధిక వాయిదా పడింది.

ఇదీ చూడండి : తనయుడితో ధావన్ డ్యాన్స్.. వీడియో వైరల్

Last Updated : Apr 23, 2020, 2:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details