తన జెర్సీపై మద్యం లోగోను తీసేయాలంటూ మొయిన్ అలీ కోరినట్లు వస్తున్న వార్తలపై చెన్నై ఫ్రాంఛైజీ స్పష్టత ఇచ్చింది. అవన్నీ అవాస్తమని, అలీ అలా అడగలేదని సీఎస్కే తేల్చి చెప్పింది. "తన జెర్సీ పైనుంచి ఎలాంటి లోగోను తీసేయమని అలీ సీఎస్కేను కోరలేదు" అని చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించాడు.
ఇదీ చదవండి:ఈ నెల 21న స్టార్ షూటర్ నారంగ్ వివాహం
కెప్టెన్ ధోనీ సారథ్యంలో ఆడడం వల్ల తమ ఆట మెరుగైందని చాలా మంది ఆటగాళ్లు తనతో అన్నారని ఇటీవల అలీ చెప్పాడు. ఈ ఏడాది వేలంలో అలీ కోసం సీఎస్కే రూ.7 కోట్లు చెల్లించింది. ఐపీఎల్లో ఇప్పటివరకూ 19 మ్యాచ్‌లాడిన అలీ 309 పరుగులు చేశాడు. 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2010 ఐపీఎల్లో అప్పటి దిల్లీ డేర్‌డేవిల్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన యూసుఫ్ పఠాన్ తన జెర్సీపై ఉన్న కింగ్‌ఫిషర్ లోగోపై టేప్ అంటించుకుని మైదానంలో దిగాడు.
ఇదీ చదవండి:కమ్మేస్తున్న కరోనా.. ఐపీఎల్లో పెరుగుతున్న కేసులు