తెలంగాణ

telangana

ETV Bharat / sports

విడిపోని అనుబంధం..ధోనీ,రైనాకి సీఎస్​కే సత్కారం - ధోని, కోచ్​ ఫ్లెమింగ్​, సురేశ్​ రైనా

రెండేళ్ల నిషేధం తర్వాత 2018 ఐపీఎల్​లో అడుగుపెట్టిన చెన్నై విజేతగా నిలిచి ఘనంగా పునరాగమనం చేసింది. ఈ సీజన్​లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మార్చి 23 నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్​కు ముందు కీలక సభ్యులను సత్కరించింది చెన్నై  ఫ్రాంఛైజీ.

ధోనీ, రైనా, ఫ్లెమింగ్​కు చెన్నై సూపర్​కింగ్స్​ సత్కారం

By

Published : Mar 22, 2019, 3:36 PM IST

చెన్నై జట్టుకు ఐపీఎల్​ మొదటి సీజన్​ నుంచి సేవలందిస్తోన్న సారథి ధోని, కోచ్​ ఫ్లెమింగ్​, సురేశ్​ రైనాను చెన్నై సూపర్​ కింగ్స్​ యాజమాన్యం సత్కరించింది. వీళ్లు 2008 నుంచి ఇదే ప్రాంఛైజీతో కొనసాగుతున్నారు.

  • ఆటగాడే కోచ్:

మొదట చెన్నై తరఫున ఆటగాడిగా బరిలోకి దిగిన ఫ్లెమింగ్ 2009 నుంచి అదే జట్టుకు కోచ్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఫ్రాంఛైజీ 2010, 2011, 2018 టైటిళ్లను కైవసం చేసుకుంది. 'ఛాంపియన్స్​ లీగ్​' టీ20 టోర్నీని రెండు సార్లు (2010,2014) గెలిచి సత్తా చాటింది.

2019లోనూ ఫేవరెట్​గా:

వివో ఐపీఎల్​ 2019లోనూ ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది చెన్నై సూపర్​కింగ్స్​. ఐపీఎల్​ 11 సీజన్ ఫైనల్లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ను ఓడించి మూడోసారి టైటిల్​ను కైవసం చేసుకుంది. ఇందులో క్రీడాకారులకు మంచి అనుభవం ఉంది. షేన్​ వాట్సన్​ లాంటి ఆటగాడు ఉండటం సూపర్​కింగ్స్​కు అదనపు బలం.

  • తొమ్మిది సీజన్లలోనూ...

సీఎస్​కే జట్టులో రైనా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రైనా రికార్డు నెలకొల్పాడు. చెన్నై జట్టు నిషేధం సమయంలో గుజరాత్​ లయన్స్​ జట్టు తరఫునా అద్భుత ప్రదర్శన చేశాడు. ధోనీ సహా కోచ్​ ఫ్లెమింగ్​ అనుభవం జట్టుకు బాగా కలిసొస్తుంది.

"ఈ సారీ కప్పు గెలవాలని అనుకుంటున్నాం. మంచి పోటీ ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. మా జట్టులో అనుభవం ఉన్న క్రీడాకారులు ఉన్నారు. వారు ఎన్నో ఐపీఎల్​లు ఆడారు. ఇదే మాకు పెద్ద బలం'
-ఫ్లెమింగ్,
చెన్నై సూపర్​ కింగ్స్​ కోచ్​

సొంత మైదానంలో తొలి మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులను పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఇస్తామని సీఎస్​కే జట్టు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details