తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నై సూపర్ కింగ్స్ సమష్టి విజయం

ఫిరోజ్ షా కోట్లా వేదికగా దిల్లీతో తలపడిన చెన్నై.. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్​, బౌలింగ్... రెండు విభాగాల్లోనూ సమష్టిగా రాణించి గెలిచింది.

చెన్నై జట్టు

By

Published : Mar 26, 2019, 11:55 PM IST

Updated : Mar 27, 2019, 12:04 AM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత మ్యాచ్​లో భారీ స్కోరు చేసిన దిల్లీ బ్యాట్స్​మెన్.. ఈ మ్యాచ్​లో 147 పరుగులే చేయగలిగారు. చెన్నై జట్టులో వాట్సన్ 44 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దిల్లీ జట్టులో ధావన్ అర్ధ సెంచరీతో రాణించాడు. ఆడిన రెండు మ్యాచ్​ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది చెన్నై.

సమష్టిగా అదరగొట్టిన చెన్నై

టాస్ ఓడి బౌలింగ్ చేసిన చెన్నై.. ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. 51 పరుగులు చేసిన ధావన్, 25 పరుగులు చేసిన పంత్ ఇతడి బౌలింగ్​లోనే ఔటయ్యారు. మిగతా బౌలర్లలో దీపక్ చాహర్, జడేజా, తాహిర్ తలో వికెట్ తీశారు.

గత మ్యాచ్​ హీరో పంత్... ఈ మ్యాచ్​లో రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. దిల్లీ జట్టులోని మిగతా బ్యాట్స్​మెన్​లో పృథ్వీషా 24, శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేశారు.

నిదానమే ప్రధానం

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది చెన్నై. ఓపెనర్ ​ వాట్సన్మొదటి నుంచి​దూకుడుగా ఆడాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాయుడు అవుటయ్యడు.

వాట్సన్​తో కలిసిన రైనా బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్​కు 52 పరుగుల భాగస్వామ్యం నమెదు చేశారు. అనంతరం 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ స్టంపౌట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే 30 పరుగులు చేసిన రైనా పెవిలియన్ బాట పట్టాడు.

అనంతంరం జాదవ్ - ధోని వికెట్లు పడకుండా ఆచితూచి ఆడారు. నాలుగో వికెట్​కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 32 పరుగులు చేసిన జాదవ్.. మ్యాచ్​ చివరి ఓవర్​లో అవుటయ్యాడు. కెప్టెన్ ధోని 35 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

దిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఇషాంత్, రబాడా తలో వికెట్ తీశారు.

Last Updated : Mar 27, 2019, 12:04 AM IST

ABOUT THE AUTHOR

...view details