ప్రస్తుతం ధోని సేన.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, రహనే జట్టు దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే కెప్టెన్‌గా వంద విజయాలు సాధించిన సారథిగా ధోని రికార్డు సృష్టిస్తాడు.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో 75 పరుగులతో ఆకట్టుకున్నాడు కెప్టెన్ ధోని. మరోసారి అలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ధోని నాయకత్వంలో చెన్నై జట్టు సమతూకంతో ఉంది.
ఈ సీజన్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది రాజస్థాన్ జట్టు. అందుకు తగ్గ కృషి చేయడంలో మాత్రం విఫలమైంది. గెలవాల్సిన మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. సొంత గడ్డపై జరిగిన గత మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కోల్‌కతా చేతిలో ఓడిపోయింది.