తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్మిత్ అలా చేయడం నాకు నచ్చలేదు: చాపెల్​ - స్టీవ్​ స్మిత్​ను టిమ్​ పైన్ చిన్నచూపు చూస్తున్నాడా..!

అడిలైడ్ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఫీల్డింగ్ విషయంలో స్మిత్​ తీరు తనకు నచ్చలేదని చెప్పాడు ఆ దేశ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్. ఫీల్డర్లను మార్చమని స్మిత్​.. పైన్​కు చెప్పాడని అన్నాడు.

Chappell says hate to see Smith "white-anting" captain Tim Paine
స్టీవ్ స్మిత్ - టిమ్​పైన్

By

Published : Dec 2, 2019, 8:27 PM IST

Updated : Dec 2, 2019, 11:12 PM IST

పాకిస్థాన్​తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్​ ఫీల్డింగ్ సెట్ చేయడం తనకు నచ్చలేదని అన్నాడు ఇయాన్ చాపెల్. మ్యాచ్ మధ్యలో.. ఫీల్డర్లను మార్చమని స్మిత్ పైన్​కు సూచించాడని చెప్పాడు ఆసీస్ మాజీ సారథి చాపెల్.

"ఫీల్డర్స్ మధ్యలో స్మిత్​ అలా నడుచుకుంటూ వెళ్లడం నాకు నచ్చలేదు. మ్యాచ్​ మధ్యలో ఆఫ్ సైడ్ ఫీల్డర్​ను పెట్టాలని టిమ్​ పైన్​కు స్మిత్ సూచించాడు. అయితే ఆసీస్ సారథి అతడు చెప్పినట్లు చేశాడో లేదో తెలియదు. ఇలా చేయడం నాకు ఇష్టముండదు. స్మిత్​ తీరు వైట్ యాంటింగ్​(దిగజార్చడం)లా ఉంది" -ఇయాన్ చాపెల్, ఆసీస్ మాజీ కెప్టెన్.

2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు స్మిత్. ఈ ఘటనతో అప్పటివరకు కెప్టెన్​గా ఉన్న స్మిత్ స్థానంలో టిమ్​పైన్ టెస్టు జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఈ ఏడాది ప్రపంచకప్​లో పునరాగమనం చేసిన స్మిత్​.. తన బ్యాటింగ్​తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్​లోనూ సత్తాచాటాడు.

అడిలైడ్ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్​ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. డేవిడ్ వార్నర్.. తొలి టెస్టులో శతకంతో పాటు.. రెండో టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు.

ఇదీ చదవండి: టీ20ల్లో రికార్డు.. పరుగులేమి ఇవ్వకుండా 6 వికెట్లు

Last Updated : Dec 2, 2019, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details