తెలంగాణ

telangana

ETV Bharat / sports

దీపక్ చాహర్ హ్యాట్రిక్.. ర్యాంక్ 88 స్థానాలు పైకి - chahar best

ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్​లో భారత బౌలర్ దీపక్ చాహర్ 88 స్థానాలను మెరుగుపర్చుకొని 42వ ర్యాంకులో నిలిచాడు. బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ 7, కేఎల్ రాహుల్ 8వ ర్యాంక్​లో ఉన్నారు.

చాహర్

By

Published : Nov 11, 2019, 4:37 PM IST

Updated : Nov 11, 2019, 5:01 PM IST

బంగ్లాదేశ్​తో జరిగిన చివరి టీ20లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దీపక్ చాహర్. ఫలితంగా ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లాడు. 88 స్థానాలు మెరుగుపర్చుకుని 42వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ టాప్​లో, కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్ రెండో స్థానంలో ఉన్నారు.

బ్యాట్స్​మెన్​లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్​లో అర్ధశతకంతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి చేరాడు.

బ్యాట్స్​మెన్ ర్యాంకింగ్స్​లో పాక్​కు చెందిన బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ క్రికెటర్ ఫించ్ రెండో ర్యాంకులో, డేవిడ్ మలాన్(ఇంగ్లాండ్) మూడో స్థానంలో ఉన్నారు.

జట్లు ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్ తొలిస్థానం.. ఓ పాయింట్ తేడాతో ఆస్ట్రేలియా రెండులో ఉంది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వరుసగా మూడు, నాలుగు ర్యాంకుల్లో ఉన్నాయి. భారత్​ ఐదులో కొనసాగుతోంది.

ఇదీచదవండి: సీనియర్ల వల్లే ఓడిపోయాం: మహ్మదుల్లా

Last Updated : Nov 11, 2019, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details