తెలంగాణ

telangana

ETV Bharat / sports

చాహల్​- ధనశ్రీ అలా ప్రేమలో పడ్డారు!

తనకు కాబోయే భార్య ధనశ్రీ లాక్​డౌన్ సమయంలో పరిచయమైనట్లు తెలిపాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​. ఆ సమయంలోనే ప్రేమలో పడినట్లు చెప్పాడు.

Chahal
చాహల్

By

Published : Sep 10, 2020, 7:51 PM IST

Updated : Sep 10, 2020, 7:58 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్​ యుజ్వేంద్ర చాహల్​ ఐపీఎల్​ ముంగిట నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చాడు. త్వరలోనే కొరియోగ్రాఫర్ అయిన​ ధనశ్రీ వర్మను పెళ్లాడనున్నాడు. అయితే తాజాగా తన ప్రేమ వివాహం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

లాక్​డౌన్​లో క్రికెట్​కు దూరమై ఇంట్లోనే గడిపిన చాహల్​కు.. ఆ సమయంలో చాలా బోర్​ కొట్టిందని చెప్పాడు. ఇండోర్​ జిమ్​లో కసరత్తులు, ఇంకా అనేక వ్యాపకాలతో గడిపినప్పటికీ వెలితిగానే ఉందనిపించేదట. దీంతో టైంపాస్​ కోసం డ్యాన్స్​ నేర్చుకోవడానికి వెళ్లిన అతడికి.. కొరియోగ్రాఫర్​ ధనశ్రీ పరిచయమైనట్లు తెలిపాడు. అలా వారిమధ్య ఉన్న స్నేహం, ప్రేమగా చిగురించిందని స్పష్టం చేశాడు.

దీంతోపాటు లాక్​డౌన్​ తర్వాత మళ్లీ ఐపీఎల్​ 13లో ఆడబోతుండటంపై సంతోషం వ్యక్తం చేశాడు చాహల్​. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు జరగనున్న ఈ మెగాలీగ్​లో ఆర్సీబీకి పాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి రియా చక్రవర్తి బెయిల్​పై తీర్పు వాయిదా

Last Updated : Sep 10, 2020, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details