తెలంగాణ

telangana

ETV Bharat / sports

చాహల్​తో డ్యాన్స్ చేసింది రోహిత్​ శర్మనా? - chahal post a dance video

టీమిండియా బౌలర్ చాహల్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్​గా మారింది. ఇందులో చాహల్, శ్రేయస్, శివం దూబే డ్యాన్స్ చేస్తూ కనిపించారు. కానీ నాలుగో వ్యక్తి ఎవరా? అని నెటిజన్లు బుర్రకు పదునుపెడుతున్నారు.

రోహిత్
రోహిత్

By

Published : Feb 1, 2020, 10:39 AM IST

Updated : Feb 28, 2020, 6:14 PM IST

న్యూజిలాండ్​ పర్యటనలో విజయపరంపరను కొనసాగిస్తోంది టీమిండియా. ఇప్పటికే 5 టీ20ల సిరీస్​లో 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు జట్టు సభ్యులు. నాలుగో టీ20 అనంతరం చాహల్, శ్రేయస్ అయ్యర్, శివం దూబే డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడు బౌలర్ చాహల్. ఇందులో ఓ వ్యక్తి సరిగా కనిపించడం లేదు. కానీ అతడు రోహిత్ శర్మనే అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. చాహల్, రోహిత్ ఎప్పుడూ సరదాగా ఉంటుంటారు. వీరీ మధ్య చాలా వీడియోల్లో కలిసి కనిపించారు.

వీరంతా లయబద్ధంగా డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది. నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. చాహల్ టీవీ షోకు ఆడిషన్స్​ జరుగుతున్నాయా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. సంగీత్​ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారా? అని మరో నెటిజన్ అడిగాడు.

ఇవీ చూడండి.. సాక్షి.. ఇదంతా ఇన్​స్టా ఫాలోవర్స్ కోసమేనా: ధోనీ

Last Updated : Feb 28, 2020, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details