టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ లాక్‌డౌన్ సమయంలో టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను అలరించాడు. నిత్యం ఏదో ఒక వీడియోతో ఆకట్టుకునేవాడు. ఫన్నీ వీడియోలతో బాగా ప్రాచుర్యం పొందాడు. అలాగే ఏ క్రికెటర్ అయినా ఆన్‌లైన్‌లో కనిపిస్తే చాలు చటుక్కున వాళ్ల మధ్య దూరిపోయి సరదా జోక్‌లతో కవ్వించేవాడు. ఈ క్రమంలోనే అతడి వీడియోలు చూసి క్రిస్‌గేల్, రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు అతడిపై కామెంట్లు చేశారు. ఇక లాక్‌డౌన్ అనంతరం ధనశ్రీతో నిశ్చితార్థం చేసుకున్న యూజీ.. ఆ ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని.. ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. తాజాగా ధనశ్రీతో కలిసి ఓ వీడియో చేశాడు.
కాబోయే భార్యతో కలిసి అదరగొట్టిన చాహల్! - చాహల్ వీడియో
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి ఓ వీడియోతో అభిమానుల ముందుకొచ్చాడు. ఈసారి తనకు కాబోయే భార్య ధనశ్రీతో కలిసి ఓ పాటకు తగ్గట్లు హావభావాలు పలికించి అదరగొట్టాడు. ఈ వీడియోకు వెస్టిండీస్ క్రికెటర్ గేల్ ఫన్నీ కామెంట్ పెట్టాడు.
![కాబోయే భార్యతో కలిసి అదరగొట్టిన చాహల్! కాబోయే భార్యతో కలిసి అదరగొట్టిన చాహల్!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8666207-10-8666207-1599134733105.jpg)
కాబోయే భార్యతో కలిసి అదరగొట్టిన చాహల్!
ఈ వీడియోలో కాబోయే దంపతులిద్దరూ అదరగొట్టారు. తమ నటనతో ఆ పాటకు తగ్గ హావభావాలు పలికించి నెటిజన్లను ఫిదా చేశారు. ఆ వీడియో చూసిన వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ మరోసారి చాహల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. "చాహల్ ఇప్పటికే చాలా చేశావు. నేనిప్పుడు నీ ఇన్‌స్టాగ్రామ్‌ను రిపోర్ట్ చేస్తున్నా" అంటూ హెచ్చరించాడు. అయితే, ఇలా సరదాకే కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గేల్ ఆ కామెంట్‌లో నవ్వుతున్న ఎమోజీలు జతచేశాడు.
Last Updated : Sep 3, 2020, 8:39 PM IST