టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహర్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో వేగంగా 50 వికెట్లు మైలురాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 31ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసి రవిచంద్రన్ అశ్విన్(52 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రాను(51) వెనక్కినెట్టాడు.
ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మదుల్లా వికెట్‌ను తీసి 50వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ 46 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీయగా... బుమ్రా 42 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.