భారత్xఆస్ట్రేలియా తొలి టీ20లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా స్పిన్నర్ చాహల్ మైదానంలోకి వచ్చాడు. టీమ్ఇండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో స్టార్క్ వేసిన బౌన్సర్ జడేజా హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో కంకషన్‌కు గురైన అతడి స్థానంలో చాహల్ మైదానంలోకి వచ్చాడని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. ప్రస్తుతం జడేజా ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పరిశీలిస్తోందని తెలిపింది. జడేజా ఆఖర్లో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడం వల్ల భారత్ 161 పరుగులు చేసింది. అతడు 23 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేశాడు.
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్.. ఆసీస్ కోచ్ అసంతృప్తి - భారత్ vs ఆస్ట్రేలియా తొలి టీ20
జడేజాకు కంకషన్‌గా జట్టులోకి వచ్చిన చాహల్.. మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే చాహల్‌ను తీసుకోవడంపై ఆసీస్ కోచ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జడేజాకు కంకషన్‌గా చాహల్.. ఆసీస్ కోచ్ అసంతృప్తి
మరోవైపు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చాహల్ బంతితో మాయచేశాడు. నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. జడేజా స్థానంలో చాహల్ రావడంపై ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌తో మాట్లాడాడు.
గత ఏడాది జులైలో ఐసీసీ కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనలను తీసుకువచ్చింది. మ్యాచ్ మధ్యలో ఆటగాడి తలకి గాయమైతే అతడి స్థానంలో వచ్చే సబ్‌స్టిట్యూట్ బౌలింగ్/బ్యాటింగ్ చేయొచ్చు.
Last Updated : Dec 4, 2020, 5:53 PM IST