తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్​: చాహల్, కుల్దీప్​కు రోహిత్ ర్యాపిడ్ ఫైర్​ - kuldeep rohit

రోహిత్ శర్మ, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ మధ్య జరిగిన ఫన్నీ  సంభాషణను ట్విట్టర్లో పంచుకుంది బీసీసీఐ. రోహిత్ శర్మ స్పిన్ ద్వయంతో చేసిన ర్యాపిడ్ ఫైర్​ వీడియోను షేర్ చేసింది.

Chahal and Kuldeep unanimously pick Shivam Dube as the worst dancer in Indian team
రోహిత్, చాహల్

By

Published : Dec 10, 2019, 2:38 PM IST

టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్​కు ర్యాపిడ్ ఫైర్ నిర్వహించాడు. వీరు ముగ్గురు జరిగిన ఫన్నీ ఇంటర్వ్యూను బీసీసీఐ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

రోహిత్ ర్యాపిడ్ ఫైర్​..

రోహిత్​: హైదరాబాద్​లో అత్యుత్తమమైంది ఏంటి?

చాహల్: వెజ్ బిర్యానీ

కుల్దీప్​: రాజీవ్​ గాందీ ఇంటర్నేషన్ స్టేడియం. ఎందుకంటే నేను ఇక్కటే టీ20లో అరంగేట్రం చేశా.

రోహిత్​: జట్టులో చెత్త డ్యాన్సర్ ఎవరు?

చాహల్​:శివమ్ దూబే

కుల్దీప్: శివమ్ దూబే

రోహిత్​: జట్టులో అత్యంత చెత్త హెయిర్ స్టైల్ ఎవరిది?

చాహల్: మహ్మద్ షమీ

కుల్దీప్: భరత్ అరుణ్​

రోహిత్​: ఏ బ్యాట్స్​మెన్​కు బౌలింగ్ వేయకూడదని అనుకుంటున్నారు?

చాహల్: నీకే(రోహిత్​)

కుల్దీప్​: సూర్యకుమార్ యాదవ్​

ఈ సందర్భంగా రోహిత్.. జట్టులో ఎవరినైన మిమిక్రీ చేయమని వారిద్దరిని అడగ్గా. చాహల్.. హిట్ మ్యాన్​ వాయిస్​ను మిమిక్రీ చేశాడు. రోహిత్​కు అది అంతగా నచ్చలేదు. నువ్వు చాలా చెత్తనటుడువు(బహోత్ బేకార్ యాక్టర్ హై) అంటూ చాహల్​పై కౌంటర్ వేశాడు. అయితే షమీ గొంతును అద్భుతంగా అనుకరించాడు కుల్దీప్ యాదవ్.

తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 15 బంతులు మిగిలుండగానే పూర్తి చేశారు కరీబియన్ బ్యాట్స్​మెన్. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్(67) అర్ధశతకంతో రాణించాడు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్​ 1-1 తేడాతో సమంగా ఉంది. బుధవారం నిర్ణాయాత్మక చివరి మ్యాచ్​ జరగనుంది.

ఇదీ చదవండి: యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికాను చూశారా..!

ABOUT THE AUTHOR

...view details