విశాఖపట్టణం వేదికగా జరుగుతోన్న భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో సఫారీ బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గర్ శతకం బాదాడు. అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఇండియా పిచ్‌లపై ఓ సౌతాఫ్రికా ప్లేయర్ టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. 2010లో ఆమ్లా చివరిసారిగా భారత్‌లో మూడంకెల స్కోర్ చేశాడు.
భారత గడ్డపై ఎల్గర్ రికార్డు సెంచరీ
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో సఫారీ ఓపెనర్ డీన్ ఎల్గర్ సెంచరీ చేశాడు. భారత పిచ్‌లపై 2010 తర్వాత శతకం బాదిన సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఎల్గర్
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఎల్గర్ మాత్రం భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 74 వ్యక్తిగత పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా ఈ ఆటగాడి క్యాచ్ మిస్ చేయడం వల్ల బతికిపోయాడు. వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని 160 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి.
మూడో రోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఎల్గర్‌తో పాటు డికాక్ శతకంతో మెరిశాడు.
ఇవీ చూడండి.. జడేజా ఖాతాలో అరుదైన రికార్డు..
Last Updated : Oct 5, 2019, 6:35 AM IST