తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​కు ముందే మరో టీ20 లీగ్​.. ఆగస్టు 18 నుంచే - Trinidad & Tobago hosting cpl 2020

దాదాపు మూడు నెలలుగా మూగబోయిన అంతర్జాతీయ క్రికెట్​ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్​ సహా పలు టోర్నీల నిర్వహణపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​(సీపీఎల్​) మాత్రం క్రికెట్​ ప్రియులను అలరించేందుకు సిద్ధమౌతోంది. ఆగస్టు 18 నుంచే ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

cpl news 2020
ఐపీఎల్​కు ముందే మరో టీ20 లీగ్​.. ఆగస్టు 18 నుంచే

By

Published : Jul 11, 2020, 1:11 PM IST

క్రికెట్ ప్రేక్షకులకు శుభవార్త. ఇప్పటికే వెస్టిండీస్-ఇంగ్లాండ్​ మధ్య టెస్టు సిరీస్​తో చాలా రోజుల క్రికెట్ విరామానికి బ్రేక్​ పడగా... త్వరలో టీ20 క్రికెట్​తో మరింత మజా రానుంది. ఇందుకు కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​ వేదిక కానుంది. ఈ ఏడాది సీపీఎల్​-2020 ఎడిషన్​ ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లోనే నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూనే టోర్నీ జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు.

ట్రినిటాడ్​ అండ్​ టొబాగో వేదికగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్​ 10 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ సీజన్​లో కరీబియన్​ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు పాల్గొననున్నారు. రషీద్​ ఖాన్​, క్రిస్ ​లిన్​, కార్లోస్​ బ్రాత్​వైట్​, డ్వేన్​ బ్రావో, అలెక్స్​ హేల్స్​, కీరన్​ పోలార్డ్​ ఈ క్రీడాపండుగలో పాలు పంచుకోనున్నారు. క్రిస్​ గేల్​ మాత్రం ఆడట్లేదు.

"టోర్నీ ప్రారంభానికి ముందే అన్ని జట్లు, అధికారుల కోసం ఒక హోటల్ ​కేటాయిస్తాం. టోర్నీ కోసం వచ్చిన ప్రతి ఆటగాడు రెండు వారాల పాటు క్వారంటైన్​ నిబంధనలు పాటించాలి. ట్రినిడాడ్​కు వచ్చేముందు, టోర్నీ ముగిసిన తర్వాత వెళ్లేముందు ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయనున్నాం. చిన్నపాటి క్లస్టర్లుగా ఏర్పాటు చేసిన గదుల్లో ఆటగాళ్లు ఉంటారు. కాబట్టి ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆ క్లస్టర్​లో ఉన్న అందరూ 14 రోజులు క్వారంటైన్​కు వెళ్లాల్సి ఉంటుంది. రోజూ ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రతను చెక్​ చేస్తారు"

- సీపీఎల్​ నిర్వాహకుల ప్రకటన

ఈ లీగ్​లో ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో ట్రిన్​బాగో నైట్​రైడర్స్​ జట్టు.. కోల్​కతా నైట్​రైడర్స్​ యజమాని షారుఖ్​ ఖాన్​కు చెందింది. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్ జట్టుకు సెయింట్​ లూయిస్​ జట్టులో వాటాలున్నాయి. ఈ రెండు ఫ్రాంఛైజీలు ఐపీఎల్​లో కీలక భాగస్వామ్యాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ టీ20 టోర్నీ ఫలితాలను ఐపీఎల్​ యాజమాన్యం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్​పై సందిగ్ధం కొనసాగుతోంది.

ఇదీ చూడండి: పీసీబీకి స్పాన్సర్ దొరికింది.. కానీ లాభం లేదు!

ABOUT THE AUTHOR

...view details