ప్రస్తుత క్రికెట్లో కోహ్లీ, రోహిత్ ఎవరు గొప్ప? అనే చర్చ నడుస్తోంది. కొందరు విరాట్‌కు మద్ధతు పలకగా, మరికొందరు రోహిత్ పేరు చెబుతున్నారు. తాజాగా ఇదే విషయమై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్.. ఛేదనలో కోహ్లీనే కింగ్ అని చెప్పాడు.
"భారత్ భారీ లక్ష్యాలను పూర్తిచేసే క్రమంలో కోహ్లీ నిలకడగా ఆడతాడు. రోహిత్.. కొత్త బంతిని చాలా చక్కగా ఎదుర్కొని బౌలర్లను ఉతికారేస్తాడు. ఈ విషయంలో వీరిద్దరిని పోల్చి చూడటం సరికాదు. ఎవరికి వారే సాటి. కానీ ఛేదనలో విరాట్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్" -బ్రాడ్ హాగ్, ఆసీస్ మాజీ బౌలర్