తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా సెలక్టర్​గా అజిత్ అగార్కర్?

టీమిండియా సెలక్టర్​ రేసులో ఉన్న అజిత్ అగార్కర్ విషయంపై ఇప్పుడే చెప్పలేనని అన్నారు క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు మదన్​లాల్. మార్గదర్శకాలు వస్తేనే ఆ విషయం తెలుస్తుందని చెప్పారు.

టీమిండియా సెలక్టర్​గా అజిత్ అగార్కర్?
భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్

By

Published : Feb 7, 2020, 7:22 PM IST

Updated : Feb 29, 2020, 1:25 PM IST

సెలక్షన్‌ కమిటీ నూతన సభ్యులను ఎంపిక చేసేందుకు బీసీసీఐ మార్గదర్శకాల కోసం వేచి చూస్తున్నామని క్రికెట్‌ సలహా కమిటీ సభ్యుడు మదన్‌లాల్‌ అన్నారు. నిబంధనలపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ఎమ్మెస్కే ప్రసాద్‌, గగన్‌ ఖోడా పదవీ కాలం పూర్తయిన తర్వాత, బోర్డు కొత్తవారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే.

'క్రికెట్‌ సలహా కమిటీకి నన్ను ఎంపిక చేయగానే బీసీసీఐతో మాట్లాడాను. జాతీయ సెలక్టర్లను ఎంపిక చేసేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉంది' అని మదన్‌ లాల్‌ అన్నారు.

భారత మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌.. కొత్త చీఫ్‌ సెలక్టర్‌ రేసులో ముందంజలో ఉన్నాడని తెలుస్తోంది. కానీ ఆయన వెస్ట్‌జోన్‌కు చెందిన ఆటగాడు. ఇప్పటికే అక్కడి నుంచి జతిన్‌ పరాంజపె సెలక్షన్‌ కమిటీలో ఉన్నారు. మరి ఇద్దరు సభ్యులు ఒకే జోన్‌ నుంచి ఉండొచ్చా? లేదా అన్నదానిపై స్పష్టత లేదు. 'వెస్ట్‌జోన్‌ నుంచి జతిన్‌ పరాంజపె ఉన్నారు కాబట్టి అగార్కర్‌ను ఎంపిక చేయాలా వద్దా అన్నది ఇప్పుడే చెప్పలేను. మార్గదర్శకాలు వస్తేనే అది సాధ్యం' అని లాల్‌ పేర్కొన్నారు. ఎమ్మెస్కే స్థానంలో సౌత్‌ జోన్‌ నుంచి లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌ పోటీలో ఉన్నారు.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన గురించి మదన్‌లాల్‌ సూటిగా తన అభిప్రాయం చెప్పేశారు. 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనపై త్వరగా తేల్చేయాలి. లేదంటే క్రికెట్‌ పాలనలో ఇబ్బందులు తప్పవు. నేను చిన్నారులకు కోచింగ్‌ ఇవ్వడం మానలేనని స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే ప్రస్తుతం నాకు, నా కుటుంబానికి అన్నం పెడుతోంది ఆ కోచింగే. నాకు విరుద్ధ ప్రయోజనాలు లేవని నేనెంతో నిజాయతీగా డిక్లరేషన్‌ ఇచ్చాను' అని ఆయన అన్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టును కొత్త సెలక్షన్‌ కమిటీనే ఎంపిక చేస్తుందని గతంలోనే గంగూలీ వెల్లడించారు.

Last Updated : Feb 29, 2020, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details