ఐపీఎల్‌ను ఈ ఏడాదే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. కొత్త తేదీలనూ ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 మధ్య పూర్తిస్థాయి టోర్నీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఊ)లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టీమ్ఇండియా ఆసీస్ పర్యటనకు వెళ్లాల్సిన కారణంగా భారత ఆటగాళ్లు బయలుదేరే వారం ముందే ఈ టోర్నీని ముగించనున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఐపీఎల్ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ నుంచి ఏటా రూ.3,300 కోట్లు, టైటిల్ స్పాన్సర్ వివో నుంచి రూ.440 కోట్లు.. ఇతర స్పాన్సర్ల నుంచి రూ.170 కోట్ల ఆదాయం రానుందని తెలుస్తోంది. ఒకవేళ లీగ్ రద్దయి ఉంటే ఈ మొత్తం కోల్పోవాల్సి వచ్చేది.
బీసీసీఐకి రూ.4 వేల కోట్ల నష్టం తప్పింది.. ఎలా అంటే?
కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలోనూ ఐపీఎల్‌ను జరిపేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఒకవేళ టోర్నీ వాయిదా పడితే మాత్రం దాదాపు రూ. 4 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. అందుకే ఎలా అయినా సరే లీగ్‌ను విజయవంతంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది.
ఐపీఎల్ రద్దైతే బీసీసీఐకి రూ.4 వేల కోట్ల నష్టం!
ఐపీఎల్ ప్రసారదారు స్టార్ ఇండియా.. బీసీసీఐకి ఇప్పటికే రూ.2 వేల కోట్లను చెల్లించిందని సమాచారం. కాబట్టి ఈ పరిస్థితుల్లో టోర్నీ ఆగిపోతే కోర్టు కేసులకు దారి తీసే అవకాశం ఉంది. అదే విధంగా అడ్వాన్స్ తిరిగి చెల్లించడం లేదా కాంట్రాక్టును పొడిగించడం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ టోర్నీని నిర్వహించేందుకే బోర్డు శతవిధాల ప్రయత్నిస్తుంది.