టీమిండియా మిస్టర్కూల్ మహేంద్రసింగ్ ధోనీకి 15ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మధుర స్మృతులున్నాయట. ముఖ్యంగా వాటిలో రెండు జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నాడు మహీ. తొలిసారి తన సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత జరిగిన ఘటన ఒకటి కాగా.. 2011లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సందర్భం రెండోదని చెప్పాడు ధోనీ.
వారి కళ్లల్లో ఆనందం చూశా: ధోనీ
2007 ప్రపంచకప్ గెలిచిన అనంతరం మేము భారత్కు తిరిగొచ్చాం. బస్సులో ముంబయిలో మెరైన్ డ్రైవ్ మీదుగా ప్రయాణిస్తున్నాం. మొత్తం రొడ్డంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతో మంది మమ్మల్ని చూసేందుకు అక్కడికి వచ్చారు. వాళ్లల్లో ముఖ్యమైన పనిమీద వెళ్లే వారుంటారు. వివాహ వేడుకల వేళ్లేవారుంటారు, కొంతమందికి ఫ్లైట్ మిస్సయి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆనందం. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇప్పటికీ ఆ సంఘటన కళ్ల ముందే మెదులుతూనే ఉంది.