టీమ్ఇండియాతో జరగనున్న బాక్సింగ్‌డే (రెండో) టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'కు జానీ ముల్లాగ్ మెడల్‌ను బహుకరించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ తరపున కెప్టెన్‌గా వ్యవహరించిన జానీ ముల్లాగ్ స్మారకంగా ఆ మెడల్‌ను సీఏ ప్రదానం చేయనుంది.
బాక్సింగ్‌డే టెస్టు: ఉత్తమ ఆటగాడికి ముల్లాగ్ మెడల్ - జానీ ముల్లాగ్ మెడల్ వార్తలు
బాక్సింగ్‌డే టెస్టులో ఉత్తమంగా రాణించిన ఆటగాడికి జానీ ముల్లాగ్ మెడల్‌ను బహుకరించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సోమవారం ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ తరపున కెప్టెన్‌గా వ్యవహరించిన జానీ ముల్లాగ్ స్మారకంగా ఈ మెడల్‌ను సీఏ ప్రదానం చేయనుంది.
1868లో యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు ముల్లాగ్. ఆస్ట్రేలియా తరపున ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకుని 45 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 1868లో జరిగిన యూకే పర్యటనలో 20 సగటుతో 1698 పరుగులు రాబట్టడం సహా 1877 ఓవర్లు బౌలింగ్ చేసి అందులో 831 ఓవర్లను మెయిడిన్ చేయగలిగాడు. ఆ పర్యటనలో మొత్తంగా 245 వికెట్లను పడగొట్టిన ముల్లాగ్.. ఒకేసారి పది వికెట్లను సాధించడం విశేషం. దీంతో పాటు వికెట్‌కీపర్‌గానూ వ్యవహరించిన ముల్లాగ్.. తన కెరీర్లో నాలుగు స్టంపింగ్స్ చేశాడు.
ఇదీ చూడండి:కివీస్‌తో తొలిటెస్టుకు బాబర్, ఇమామ్ దూరం