సిడ్నీ టెస్టు సందర్భంగా భారత క్రికెటర్లపై జాతి వివక్ష దూషణలకు దిగిన ప్రేక్షకులను గుర్తించలేకపోయామని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. ఐసీసీతో చెప్పింది. స్టాండ్స్ నుంచి గెంటివేసిన ఆరుగురు ప్రేక్షకులు అసలు దోషులు కాదని విచారణలో తేలిందని తెలిపింది. ఈ మేరకు ఐసీసీకి.. సీఏ నివేదికను సమర్పించింది.
'వారిని గుర్తించలేకపోయాం.. ఆ ఆరుగురు నిర్దోషులే' - టీమ్ఇండియా జాతి వివక్ష సిడ్నీ టెస్టు
సిడ్నీ టెస్టులో టీమ్ఇండియా ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ప్రేక్షకులను గుర్తించలేకపోయామని ఐసీసీకి.. క్రికెట్ ఆస్ట్రేలియా నివేదికను సమర్పించింది. స్టాండ్స్ నుంచి గెంటివేసిన ఆరుగురు ప్రేక్షకులు నిర్దోషులుగా విచారణలో తేలిందని తెలిపింది.
జాతి వివక్ష
"భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు నిజమే అని నమ్ముతున్నాం. కానీ దర్యాప్తు అధికారులు దోషులను గుర్తించలేకపోయారు" అని నివేదికలో సీఏ పేర్కొన్నట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. అంతకుముందు తన ఓవర్లో రెండు సిక్స్‌లు పోయినందుకు కలత చెందిన సిరాజ్.. ప్రేక్షకుల్లో ఒకరు "వెల్కమ్ టు సిడ్నీ, సిరాజ్" అన్నందుకు అంపైర్ వద్దకు వెళ్లినట్లు గెంటివేతకు గురైన ఓ ప్రేక్షకుడు చెప్పాడని ఓ పత్రిక తెలిపింది.
ఇదీ చూసింది:క్రికెట్లోనూ జాతి వివక్ష.. ఇవిగో సాక్ష్యాలు..!