తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2020, 2:49 PM IST

ETV Bharat / sports

రిజర్వ్​డే కోసం ఐసీసీకి క్రికెట్​ ఆస్ట్రేలియా వినతి

ఈ ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్​ నాకౌట్​ మ్యాచ్​లకు రిజర్వ్​డే కేటాయించాలని క్రికెట్​ ఆస్ట్రేలియా ఐసీసీని కోరనుంది. త్వరలో జరగబోయే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ విషయంపై స్పష్టత రానుంది.

CA may propose introduction of semifinal reserve days for Men's T20 World Cup in ICC meeti
రిజర్వ్​డే కోసం క్రికెట్​ ఆస్ట్రేలియా ఐసీసీకి వినతి

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది నిర్వహించనున్న పురుషుల టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్స్​కు రిజర్వ్​డే అవసరమని క్రికెట్​ ఆస్ట్రేలియా భావిస్తోంది. త్వరలో జరగబోయే ఐసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొననున్న క్రికెట్​ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కెవిన్​ రాబర్ట్స్​ ఈ విషయాన్ని అందరిముందు ప్రసావించనున్నారు.

ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​ సెమీస్​లో రిజర్వ్​డే లేకపోవడం వల్ల ఇంగ్లాండ్​ జట్టు తీవ్రంగా నష్టపోయింది. మొదటి సెమీఫైనల్​ రద్దవ్వటం వల్ల లీగ్​ దశలో ఎక్కువ విజయాలు సాధించిన టీమిండియా తుదిపోరుకు చేరింది. ఈ పరిణామంతో నాకౌట్​ దశలో రిజర్వ్​డే అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.

పురుషుల టీ20 ప్రపంచకప్​ ప్రారంభమవ్వటానికి ఇంకా నాలుగున్నర నెలల సమయం ఉంది. దీంతో ఈ టోర్నీలో రిజర్వ్​డే కేటాయించాలని ఐసీసీని కోరనుంది ఆసీస్​ క్రికెట్​ బోర్డు. దీనిపై త్వరలో నిర్వహించే ఐసీసీ సమావేశంలో నిర్ణయించనున్నట్టు ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ సమావేశంలో కమిటీ అధికారికంగా సంతకం చేస్తుందని వెల్లడించారు. క్రికెట్​లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి కచ్చితంగా కార్యనిర్వాహక కమిటీ ఆమోదం కావాలని అన్నారు.

ఇదీ చూడండి.. ఎడిట్​ చేసిన ఫొటోతో అడ్డంగా బుక్కైన పీటర్సన్​

ABOUT THE AUTHOR

...view details