తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సూపర్ సిరీస్​ ఓ సృజనాత్మక ఆలోచన'

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రతిపాదించిన నాలుగు దేశాల సూపర్ సిరీస్​పై ఆసీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఇదొక సృజనాత్మక ఆలోచన అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్​ అన్నారు.

ప్రతిపాదించిన నాలుగు దేశాల సూపర్ సిరీస్​పై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పందించింది. ఇదొక సృజనాత్మక ఆలోచన అని
Ganguly

By

Published : Dec 27, 2019, 3:18 PM IST

ఏటా ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించాలని చూస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా, నాలుగు మెగా జట్లతో ఓ సిరీస్​ నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఇదివరకే ఈ విషయంపై ఓ ప్రతిపాదన చేయగా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డూ.. అదొక సృజనాత్మక ఆలోచన అని పేర్కొంది.

"సౌరభ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడయ్యాక తీసుకున్న నిర్ణయాల్లో ఇదొక సృజనాత్మక ఆలోచన. తక్కువ సమయంలోనే డే అండ్ నైట్ టెస్టు నిర్వహించి మంచి ఫలితాన్ని సాధించాడు. ఇప్పుడీ సూపర్​ సిరీస్​ గొప్ప ఆలోచన. వచ్చే ఏడాది నేను.. భారత్, బంగ్లాదేశ్ పర్యటనకొస్తాను. ఈ రెండు దేశాలతో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్​తోనూ భవిష్యత్ కార్యచరణ గురించి చర్చలు జరపాల్సి ఉంది"
-కెవిన్ రాబర్ట్స్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ

క్రికెట్​లో లీడర్​గా ఉన్న ఆస్ట్రేలియా.. మిగతా దేశాలన్నింటికి సహకారం అందిస్తుందని చెప్పిన కెవిన్​.. మిగతా దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడతామని స్పష్టం చేశారు.

"వచ్చే ఏడాది అఫ్గానిస్థాన్​కు అతిథ్యం ఇవ్వబోతున్నాం. ఇది క్రికెట్​ పట్ల మాకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రపంచ క్రికెట్​ను అభివృద్ధి పథంలో నడపడానికి ఐసీసీలోని మిగతా దేశాలన్నింటితో సంప్రదింపులు జరుపుతున్నాం. ఉపఖండంలో క్రికెట్​ ఓ మతంలాంటిది"
-కెవిన్ రాబర్ట్స్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ

ఈ మెగాటోర్నీలో భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతో పాటు మరో అగ్ర జట్టు పాల్గొనే అవకాశముంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. 2021 నుంచి మూడు పెద్ద జట్లు రొటేషనల్‌ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తాయి. తద్వారా ఆయా క్రికెట్‌ బోర్డులు ఆర్థికంగా లాభపడే అవకాశముంది. ఐసీసీ.. మూడు దేశాలకు మించి టోర్నీలు నిర్వహించడానికి అనుమతించదు.

ఇవీ చూడండి.. నికోలస్ స్టన్నింగ్ క్యాచ్​.. స్మిత్ పెవిలియన్​కు

ABOUT THE AUTHOR

...view details