తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్ అనుకున్నట్లు జరగడం కష్టమే' - వార్నర్ తాజా వార్తలు

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టీ20 ప్రపంచకప్​ జరగడం కష్టమేనని అన్నాడు ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. రోహిత్​తో జరిగిన ఇన్​స్టా లైవ్​లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

'టీ20 ప్రపంచకప్ అనుకున్నట్లు జరగడం కష్టమే'
ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

By

Published : May 8, 2020, 7:19 PM IST

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో చక్కబడేట్లు లేవని అన్నాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇలానే ఉంటే అక్టోబరులో టీ20 జరగడం అనుమానమేనని చెప్పాడు. లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్​స్టా లైవ్​లో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.

"పరిస్థితులు చూస్తుంటే టీ20 ప్రపంచకప్​ అనుకున్నట్లు జరిగేలా కనిపించడం లేదు. 16 జట్లను ఒక్కదగ్గరకు, అదీ ఇలాంటి పరిస్థితుల్లో తీసుకురావడం చాలా కష్టం" -వార్నర్, ఆసీస్ క్రికెటర్

అనంతరం మాట్లాడిన రోహిత్.. ఆస్ట్రేలియాతో తనకు మ్యాచ్​ ఆడటం చాలా ఇష్టమని చెప్పాడు. గత పర్యటనలో ఆసీస్​ జట్టుపై విజయం సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సారి స్మిత్, వార్నర్​ రాకతో సిరీస్​ మరింత రసవత్తరంగా ఉండే అవకాశముందని తెలిపాడు.

అయితే ఖాళీ మైదానాల్లో ఆడే విషయమై స్పందించిన వార్నర్.. అప్పుడు బంతి శబ్దం తప్ప మరేం వినిపించదని, వార్మప్ గేమ్ ఆడినట్లే ఉంటుందని చెప్పాడు.

రోహిత్ శర్మతో వార్నర్​ ఇన్​స్టా లైవ్

ABOUT THE AUTHOR

...view details