తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా సలహా పనిచేసింది: ఇషాంత్ శర్మ - కోహ్లీ

విండీస్​తో తొలి ఇన్నింగ్స్​లో సహచర బౌలర్​ బుమ్రా సలహాతో వికెట్లు తీయగలిగానని చెప్పాడు భారత బౌలర్ ఇషాంత్ శర్మ.

భారత బౌలర్​ ఇషాంత్ శర్మ

By

Published : Aug 25, 2019, 5:01 AM IST

Updated : Sep 28, 2019, 4:27 AM IST

వెస్టిండీస్​తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో తన అద్భుత బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు భారత బౌలర్ ఇషాంత్ శర్మ. ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు 222 పరుగులకు ఆలౌట్​ కావడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇన్నింగ్స్​ అనంతరం మాట్లాడిన ఇషాంత్​.. తనకు సలహా ఇచ్చిన యువ బౌలర్​పై ప్రశంసలు కురిపించాడు.

"వర్షం పడిన అనంతరం బంతి తడిగా మారింది. అప్పుడు మా బౌలింగ్​లో వికెట్లు తీయడం కష్టమైంది. ఆ సమయంలో క్రాస్​ సీమ్​ బౌలింగ్ వేయమని బుమ్రా సలహా ఇవ్వడం వల్ల బౌన్స్​ లభించింది. వికెట్లు దక్కించుకున్నాను" -ఇషాంత్ శర్మ, భారత బౌలర్

తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​లోనూ తోడ్పడ్డాడు ఇషాంత్ శర్మ. చేసింది 19 పరుగులే అయినా.. రవీంద్ర జడేజా(58)తో కలిసి ఎనిమిదో వికెట్​కు 60 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు.

భారత బౌలర్​ ఇషాంత్ శర్మ

ఇది చదవండి: తొలి టెస్టు: 222 పరుగులకు వెస్టిండీస్​ ఆలౌట్​

Last Updated : Sep 28, 2019, 4:27 AM IST

ABOUT THE AUTHOR

...view details