తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫిట్​నెస్​ కోసం రంజీల్లో బుమ్రా - బుమ్రా

టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా.. కొన్ని నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్​లు ముందున్న నేపథ్యంలో రంజీల్లో ఆడి ఫిట్​నెస్​ నిరూపించుకోనున్నాడు.

ఫిట్​నెస్​ కోసం రంజీల్లో బుమ్రా
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా

By

Published : Dec 24, 2019, 6:31 PM IST

భారత స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా.. దాదాపు మూడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగనున్నాడు. రంజీల్లో గుజరాత్​ తరఫున ఆడనున్నాడు. సూరత్​లో బుధవారం కేరళతో మ్యాచ్​ జరగనుంది. ఇందులో ఆడి తన ఫిట్​నెస్​ నిరూపించుకోనున్నాడు.

ఈ ఏడాది వెస్టిండీస్​తో టెస్టు​ సిరీస్​ జరుగుతుండగా బుమ్రాను వెన్నునొప్పి బాధించింది. అనంతరం శస్త్రచికిత్స జరిగింది. దాదాపు 3 నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు గాయం నుంచి కోలుకున్నాడు. త్వరలో జరిగే శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్​ల కోసం తుదిజట్టులోకి ఎంపికయ్యాడు.

టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా

ఇటీవలే విశాఖపట్నంలో జరిగిన విండీస్​-భారత్​ రెండో వన్డే ముందు నెట్​ ప్రాక్టీస్​ సెషన్​లో పాల్గొన్నాడు బుమ్రా. కానీ మైదానంలో అడుగుపెట్టలేదు.

టెస్టు​ల్లో టీమిండియా నుంచి హ్యాట్రిక్​ తీసిన బౌలర్​గా బుమ్రా ఘనత సాధించాడు. హర్భజన్​సింగ్​, ఇర్ఫాన్​ పఠాన్ ఇతని కంటే ముందున్నారు.​ ఈ ఏడాది ఆడిన 12 టెస్టుల్లో 62, వన్డేల్లో 103, టీ20ల్లో 51 వికెట్లను కొల్లగొట్టాడు జస్​ప్రీత్.

ABOUT THE AUTHOR

...view details