ఫస్ట్ టైం సిక్స్ కొట్టిన బుమ్రా...మురిసిన కోహ్లీ - టీమిండియా
ఓ బౌలర్ భారీ సిక్స్ కొడితే ఎలా ఉంటుంది...? ఆశ్చర్యపోతాం. అలాంటి సంఘటన ఆదివారం భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో వన్డేలో చోటుచేసుకుంది. కమిన్స్ లాంటి బౌలర్ బంతిని బుమ్రా కళ్లు చెదిరే సిక్స్గర్గా మలచాడు. కెప్టెన్ కోహ్లీ ఆనందంతో మురిసిపోయాడు.
ఫస్ట్ టైం సిక్స్ కొట్టిన బుమ్రా...మురిసిన కోహ్లీ
ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో టీమిండియా బౌలర్ బుమ్రా చివరి ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టాడు. సాధారణంగా ఫినిషింగ్ షాట్లు, విన్నింగ్ షాట్లు బ్యాట్స్మెన్లు బాగా కొట్టగలరు. కాని ఉన్న బ్యాటింగ్ అనుభవంతో తానూ తక్కువ కాదంటూ సమాధానం చెప్పాడు పేసర్ బుమ్రా.
- ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ పాట్ కమిన్స్ బౌలింగ్ ప్రారంభమైంది. తొలి బంతిని సిక్స్‌గా మలిచిన విజయ్ శంకర్ మూడో బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చాహల్ ఐదో బంతికి ఔటవ్వగా చివరి వికెట్‌గా బుమ్రా క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ఐదు వికెట్లు పడగొట్టిన కమిన్స్.. బుమ్రాని ఔట్ చేస్తాడని లేదంటే కనీసం బంతిని డాట్ చేయిస్తాడని అంతా భావించారు. కానీ బుమ్రా అందరి అంచనాల్ని తలకిందులు చేశాడు. చివరి బంతిని కళ్లుచెదిరే రీతిలో లాంగాన్ దిశగా సిక్స్ కొట్టాడు. బుమ్రా షాట్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క నిముషం పట్టరాని ఆనందంతో మురిసిపోయాడు.
- తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 48 వన్డేలాడిన బుమ్రా కొట్టినతొలి సిక్స్ ఇదే కావడం విశేషం.