తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా, పూనం యాదవ్​లకు పాలి ఉమ్రిగర్ అవార్డు - Bumrah set to receive Polly Umrigar Award

ప్రతిష్ఠాత్మక పాలి ఉమ్రిగర్ అవార్డుకు టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. ఇతడితో పాటు పూనం యాదవ్​కు ఈ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. ఈరోజు సాయంత్రం ముంబయిలో అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.

Bumrah set to receive Polly Umrigar Award
బుమ్రా - పూనం యాదవ్

By

Published : Jan 12, 2020, 12:15 PM IST

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక పాలి ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2018-19 సీజన్​ అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగాను అతడిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది.

ఆదివారం సాయంత్రం ముంబయిలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ దేశాల్లో 5 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్​గా బుమ్రా ఘనత సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్​కు టీమిండియా మాజీ దిగ్గజం మన్సుర్ అలీ ఖాన్ పటౌడీ మెమోరియల్ లెక్చర్ పురస్కారాన్ని ఇవ్వనున్నారు.

"మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రికెటర్లను గుర్తించేందుకు ఈ అవార్డును ఇవ్వనున్నాం. మన దిగ్గజాలు స్మారకంగా వీటిని అందజేస్తున్నాం. పటౌడీ మెమోరియల్ అవార్డును సెహ్వాగ్​కు ఇవ్వనుండటం వల్ల ఈ సాయంత్రం ఎంతో ప్రత్యేకంగా మారనుంది."

- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

పూనం యాదవ్​ను అత్యుత్తమ మహిళా క్రికెటర్​ అవార్డుకు ఎంపిక చేశారు. ఇటీవలే ఈ లెగ్ స్పిన్నర్ అర్జున అవార్డు అందుకుంది. వీరితో పాటు మాజీ క్రికెటర్లు కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాకు సీకేనాయుడు, బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారాలు అందజేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details